గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (21:04 IST)

అమీర్‌ఖాన్ 'పీకే' సెకండ్ పోస్టర్... నిండుగా బట్టలున్నాయ్...

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ నగ్నంగా ఉన్న పోస్టర్ని విడుదల చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒంటిమీద నూలుపోగు లేకుండా నడుముకి మధ్య భాగంలో ‘అక్కడ’ కేవలం ఓ పాత టేప్ రికార్డర్ ను పెట్టుకుని కనిపించి నానా హంగామా సృష్టించాడు. టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ పోస్టరుపై కేసులు, విమర్శలు, వివాదాలు తలెత్తాయి. 
 
వాటన్నిటికీ అమీర్ బదులిచ్చారు. పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని వెల్లడించాడు. అలాగే ఆగస్టు 20న విడుదల చేసే సెకండ్ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా పెట్టుకోనంటూ చెప్పిన అమీర్ అన్నంత పనీ చేశాడు. సెకండ్ లుక్ పోస్టర్ విడుదల చేసి పూర్తి దుస్తులతో దర్శనమిచ్చాడు. ఈ పోస్టరులో వంటినిండా బట్టలేసుకుని బ్యాండ్ మేళం బూర చేతిలో పట్టుకుని నిలుచున్న భంగిమలో ఉన్నాడు. మొత్తానికి పీకే పోస్టర్ పబ్లిసిటీ మామూలుగా ఉండటంలేదు.