శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (16:05 IST)

కాపీ కథతో 'పీకే'శారు

బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ హీరోగా ఇటీవల విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న చిత్రం పీకే. ఈ చిత్రంపై ఒక నవలా రచయిత ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టారు. 'పీకే' స్టోరీని తాను రచించిన హిందీ నవల 'ఫరిస్తా' నుంచి కాపీ కొట్టారంటూ కపిల్ ఇసాపురి అనే రచయిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అందులో 'పీకే' సినిమా నిర్మాత విధువినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత జోషీలు తన నవలలోని పాత్రలు అని ఇసాపురి తెలిపారు. ఇంకా తన నవలలోని 17 సన్నివేశాలను సినీ దర్శక నిర్మాతలు తెలివిగా కాపీకొట్టారని ఫిర్యాదులో ఆరోపించారు. 
 
కనుక తన ఫిర్యాదుపై విచారణ జరిపి, తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపునివ్వడంతో పాటు రూ. కోటి నష్టం పరిహారం ఇప్పించాలని ఇసాపురి  విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తాను 'ఫరిస్తా'ను 2009లో పూర్తి చేసినట్టుగాను, అది 2013లో ప్రచురితమైందని ఇసాపురి పిటిషన్‌లో విన్నవించుకున్నారు.