శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (11:59 IST)

కార్తీకేయ హిట్‌తో.. కోటి రూపాయలు పెంచేసిన నిఖిల్!

కార్తీకేయ హిట్‌తో నిఖిల్ అమాంతంగా రెమ్యునరేషన్ పెంచేశాడు. సాధారణంగా ఒక హిట్టు వస్తేనే చాలు ... హీరోలు తమ పారితోషికాన్ని అమాంతం పెంచేస్తారు. ఇక రెండు హిట్లు వస్తే వేరే చెప్పాలా? ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ అదే రూటులో వున్నాడు. 
 
వరుసగా 'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాలు హిట్టవడంతో నిర్మాతల దృష్టిలో పడ్డాడు. దాంతో ప్రస్తుతం ఈ హీరో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఇదే అదనుగా భావిస్తున్న నిఖిల్ తన పారితోషికాన్ని కోటి రూపాయలు చేసినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకు ఏభై లక్షలు తీసుకున్న ఈ హీరోగారికి 'కార్తికేయ' సినిమా ఇలా హెల్ఫ్ చేసిందన్నమాట.