శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (10:22 IST)

తాటాకు చప్పుళ్ళకు భయపడను : నటుడు శివాజీ రాజా

సహచర నటి హేమపై నటుడు శివాజీ రాజా విమర్శలు గుప్పించారు. కెమెరా ముందు నటించాలేగానీ, కెమెరా వెనుక వద్దని హేమకు శివాజీ రాజా హితవు పలికాడు. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు మద్దతుగా నిలిచేందుకు ఛాంబరుకు వచ్చానని చెప్పిన ఆయన హేమ తనపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. 
 
మాట్లాడేటప్పుడు నియంత్రణలో ఉండాలని సూచించారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి విమర్శలు చేయాల్సిన అవసరం ఆమెకు ఏముందని ప్రశ్నించారు. ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. ఎన్నికల ప్రభావం సినిమాలో నటించడంపై ఉండదని స్పష్టం చేశారు.