మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (00:14 IST)

సుమన్‌ పద్ధతి అస్సలు బాగాలేదా.. ఎందుకు... ఏంటి సంగతి...?

హీరో సుమన్ మరీ అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడా...? దారుణంగా బిహేవ్ చేస్తున్నాడా...? సినిమా ఇండస్ట్రీ పరువు అడ్డంగా తీసేవిధంగా ఆయన గారి వ్యవహార శైలి వుందా...? వేంకటేశ్వరుడు, రాముడు లాంటి మంచి మంచి పాత్రలు ధరించిన మంచి హీరోపై ఇలాంటి క్విచ్చన్ మార్కులేంటయా అనుకుంటున్నారా...?
 
వివరాల్లోకి వెళితే... దర్శకుడు గుణశేఖర్ మీద సుమన్ ఛీటింగ్ కేసు పెట్టాడు.. తాను ‘రుద్రమదేవి’ సినిమాలో నటించిన సందర్భంగా తనకు గుణశేఖర్ ఐదు లక్షలు బకాయి వున్నాడని, ఆ ఐదు లక్షలకు తనకు గుణశేఖర్ చెక్కు ఇచ్చాడని, ఆ చెక్కు బ్యాంకులో వేస్తే బౌన్స్ అయిందని కేసు పెట్టాడు.
 
చెక్కు బౌన్సయింది బాబూ అని సదరు సినిమా మేనేజర్ని సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని అందుకే తానే స్వయంగా సినిమా ఆఫీసుకి వెళ్ళి అడిగినా పట్టించుకునే నాధుడు లేడని అందుకే సుమన్‌కి ఎక్కడో కాలి గుణశేఖర్ మీద అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఛీటింగ్ కేసు పెట్టాడు
 
అయితే సుమన్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. గుణశేఖర్‌పై ఐదులక్షల కోసం కేసు పెట్టడం తగదంటున్నారు. చెక్కు బౌన్స్ కావడం ఎక్కడైనా నేరమేమోగానీ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎంతమాత్రం నేరం కాదు. ఇవన్నీ తెలిసికూడా సుమన్ కేసు పెట్టడం వెనక గట్టి  కారణమే వుండివుంటుందని సినీ పండితులు అంటున్నారు. అదేంటో మరి...?!!