గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 అక్టోబరు 2014 (11:33 IST)

‘కత్తి’కి తుప్పు లేదు గిప్పు లేదు... హేపీగా విడుదలైంది...

‘కత్తి’ చిత్రంలో 'తలైవా' తమిళ హీరో విజయ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ‘అమ్మ’కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆ సినిమా విడుదల సందర్భంగా కొంత ఇబ్బందులు ఏర్పడటంతో కొందరు ఈ కత్తికి తుప్పు పట్టిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ ఈ కత్తికి తుప్పు లేదు గిప్పు లేదు హేపీగా తమిళనాడులో విడుదలైపోయింది. 
 
విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘కత్తి’ సినిమా టికెట్ల కోసం తమిళనాడులో జనం తన్నుకుంటున్నారు. మరోవైపు ఈ చిత్రంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షేకి సంబంధాలున్నాయన్న వార్తలు రావడంతో ఈ సినిమాను తమిళనాడులో విడుదల కానివ్వమని చెప్పినా అది ఆ తర్వాత చప్పబడిపోయింది.