శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 24 జనవరి 2015 (15:57 IST)

తాగి గొడ‌వ చేసిన అంజలి... ఎక్కడ... ఎందుకు...?

వెండితెరపై చాలా పద్ధతైన పిల్లగా కనిపించే 'సీతమ్మ వాకిట్లో...' ఫేమ్ అంజలి ఎందుకో ఈమధ్య బయట ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో కనబడుతోంది. తాజాగా అంజలి బంజారాహిల్స్ లో ఉన్న లిక్విడ్ పబ్ లో పూటుగా మద్యం తాగి హంగామా చేసిందనే విషయం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారట. అంజలి తన స్నేహితుడితో కలిసి నైట్ పబ్ కి వెళ్లి అక్కడ మద్యం తాగిన తరువాత డాన్స్ ఫ్లోరుకి వెళుతుండగా ఓ యువకుడు అడ్డుతగలడంతో కోపం వచ్చిందట. దీంతో మద్యం మత్తు తలకెక్కిన ఆమె ఒక్కసారిగా ఆ యువకుడిని దూషించడం మొదలుపెట్టింది. 
 
అప్పటికీ ఆగ్రహం చల్లారని ఆమె, యువకుడితో పాటు పబ్ నిర్వాహకులపైనా తిట్ల దండకం అందుకుంది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పబ్‌కు చేరుకున్న పంజాగుట్ట పోలీసులు అంజలిని అక్కడి నుంచి పంపించివేసి పరిస్థితిని చక్కదిద్దారు.
 
తెలుగు, తమిళ సినీ రంగాల్లో ప్రముఖ నటిగా కొనసాగుతున్న నటి అంజలి.. గతంలో తమిళ దర్శకుడు కళంజియం‌, ఆమె పిన్ని, బాబాయ్‌లపై ఆరోపణలు చేసి ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఇది పెద్ద వివాదంగా మారింది కూడా. ఈ వ్యవహారంలో ఆమె మద్రాసులోని ఓ కోర్టు నుంచి మందలింపునకు కూడా గురైన విషయం తెల్సిందే.