శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (14:15 IST)

పబ్‌లో అంజలి హల్ చల్: నిర్వాహకులపై తిట్ల దండకం!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పద్ధతిగా నటించిన అంజలి నగరంలోని ఓ పబ్‌లో హల్‌చల్‌ చేసింది. శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌1లోని తబలా పబ్‌కు అంజలి వచ్చారు. 
 
డ్యాన్స్‌ఫ్లోర్‌కు వెళ్తుండగా ఓ యువకుడు అంజలికి అడ్డుగా వచ్చాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న అంజలి కోపంతో ఊగిపోతూ యువకుడిపై చిందులేసింది. 
 
వారించేందుకు ప్రయత్నించిన పబ్‌ నిర్వహకులపైనా తిట్ల దండకం అందుకుంది. పరిస్థితి శృతి మించడంలో పబ్‌ నిర్వహకులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.