గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 2 అక్టోబరు 2014 (17:42 IST)

శ్వేతాబసు కేసు ట్విస్టులపై ట్విస్టులుట... వాళ్లే రమ్మన్నారు....

సినీ నటి శ్వేతా బసు ఆమధ్య పార్క్ హయత్ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం విదితమే. పట్టుబడిన శ్వేతను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంలో ఉంచారు. ఆరు నెలలు అక్కడే ఉండాలని కూడా చెప్పేశారు. ఇకపోతే తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలికి వచ్చింది. శ్వేతా బసు తనను వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోతున్నట్లు సమాచారం. ఇందుకు సాక్ష్యంగా సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ నిర్వాహకులను న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టనున్నారని ఫిలిమ్ నగర్ న్యూస్.
 
కాగా శ్వేత పట్టుబడిన గదిని సంతోషం పత్రిక వారు బుక్ చేశారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పత్రికకు, శ్వేతాబసుకు ఉన్న లింకు ఏమిటో తెలియదు కానీ... ఫిలింనగర్‌లో మాత్రం ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఇదిలావుంటే శ్వేతా బసును అరెస్టు చేసిన సమయంలో ఆమెతో పాటు ఉన్న విటుడు ఎవరనేది ఇంతవరకూ తెలియరాలేదు. పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టడంలేదు. దీనిపై ఇప్పటికే పలు రకాల వాదనలు వినబడుతున్నాయి. పోలీసులు సంగతి సరే.... శ్వేతా బసు కూడా దీనిపై నోరు మెదపడం లేదంటే ఆ వ్యక్తి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి అయి ఉంటాడని అంటున్నారు. మొత్తమ్మీద శ్వేతాబసు వ్యభిచారం కేసులో ఇరుక్కున్నప్పటి నుంచి ఆమెతో ఆ రోజు హోటల్ గదిలో ఉన్న వ్యక్తి ఎవరనే చర్చ నడుస్తోంది. మరోవైపు శ్వేతకు అన్ని సినీ పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి.