శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (21:06 IST)

షీలాకు దిల్ రాజు ఫోన్ నెంబర్ కూడా తెలియదంట... అలాంటప్పుడు మరి...

టాలీవుడ్ 'పరుగు' హీరోయిన్ షీలా తనకు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు మధ్య లివ్ ఇన్ రిలేషన్ ఉన్నట్లు టాలీవుడ్లో పుకార్లు రావడాన్ని తీవ్రంగా ఖండించింది. అసలు తన వద్ద దిల్ రాజు ఫోన్ నెంబరు కూడా లేదనీ, అలాంటప్పుడు ఆయనతో తనకు లింకులు ఎలా పెడతారంటూ మండిపడింది. అసలు తెలుగు ఇండస్ట్రీలో తాను టచ్ లో కూడా లేననీ, పైగా తెలుగు సినిమాల్లో నటించి మూడేళ్లు దాటిపోయిందనీ, ఈ పరిస్థితుల్లో నాకు దిల్ రాజుతో ఎలా లింకులు పెడుతూ వార్తలు ప్రచారం చేస్తారంటూ ధ్వజమెత్తారు. 
 
తాను గత సంవత్సర కాలంగా ఇంగ్లాండులో ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది షీలా. అంతేకాదు తాను హైదరాబాద్ అడుగుపెట్టి మూడేళ్లు దాటిపోయిందనీ, ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి గాలివార్తలు ఎలా సృష్టిస్తారో తనకు అర్థంకావడంలేదంటూ వాపోయారు. తను కొందరు హీరోయిన్లు వెళ్లినట్లుగా బయటి ఫంక్షన్లకు కూడా వెళ్లనందున పెద్దగా బయట కూడా కనిపించనని చెపుతోంది. ఇక దిల్ రాజు... తానసలు గాలి వార్తలపై స్పందించనని తెగేసి చెప్పేశారు.