మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: సోమవారం, 28 జులై 2014 (20:54 IST)

దర్శకత్వం చాలా ఈజీ అట... అడవి కాచిన వెన్నెల డైరెక్టర్

''మా ఊళ్ళో ఓ వ్యక్తి లంకెబిందెల కోసం వున్న ఆస్తిని అమ్ముకుని అడవి పాలయిన సంఘటన జరిగింది. దానికోసం వెతుకులాట నేపథ్యంలో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ థ్రిల్లర్‌గా'' నిర్మించినదే 'అడవి కాచిన వెన్నెల' చిత్రమని దర్శకనిర్మాత అక్కి విశ్వనాథరెడ్డి అంటున్నారు.
 
సినిమాకు దర్శకత్వం చేయడం చాలా కష్టం. దానికోసం సీనియర్స్‌ దగ్గర ఏళ్ళ తరబడి పనిచేయాల్సి వుంటుంది. కానీ ఇప్పుడు వచ్చే యూత్‌ దర్శకులు మాత్రం కేవలం ఇంటర్‌నెట్‌ను బాగా వుపయోగించుకుని దర్శకులుగా మారుతున్నారు. ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో వున్నవారు కావడంతో... వారికి డైరెక్షన్‌ పరిశీలించే అవకాశం వుండదు. 
 
తాజాగా అక్కి విశ్వనాధరెడ్డి ఆ కోవలో చేరారు. అరవింద్‌ కృష్ణ హీరోగా మీనాక్షి దీక్షిత్‌, పూజ రామచంద్రన్‌ హీరోయిన్స్‌గా మూన్‌లైట్‌ డ్రీమ్స్‌ పతాకంపై 'అడవి కాచిన వెన్నెల' చేశాడు. ఈ చిత్రం గురించి ఆయన చెబుతూ... లంకెబిందెలు నేపథ్యంలో కథ వుంటుంది. ఆగస్ట్‌ 1న విడుదల కానుంది అన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేస్తూ బెంగుళూరు, కొరియా, చైనా వంటి పలు ప్రాంతాలను తిరిగాను. కథలు రాస్తుండేవాడిని.
 
దర్శకుడిగా ఎవరి దగ్గరా అనుభవంలేదు. కేవలం నెట్‌లో దర్శకత్వానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని ధైర్యంగా ముందుకు వచ్చాను. నెట్‌లో మేకింగ్‌ టెక్నాలజీ గురించి విపులంగా తెలుసుకున్నాను. కడపలోని కలసపాడు గ్రామంలో పుట్టి పెరిగి ఆ తర్వాత టౌన్‌, సిటీ, విదేశాల్లో పెద్ద నగరాలకు నా ప్రయాణం సాగడంతో పలురకాల మనుషుల ప్రవర్తలను, సంస్కృతిని, మనుషుల్లోని మార్పులను పరిశీలించాను. అది సినిమాకు చాలా ఉపయోగపడింది అన్నారు.