గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (16:43 IST)

ఆగడు: మహేష్ బాబు హ్యాపీ.. ప్రీ రిలీజ్ స్టేజ్‌లోనే రూ.10కోట్ల లాభాలు!

'ఆగడు' సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎలాగంటే ప్రీ రిలీజ్ స్టేజ్‌లోనే రూ.10కోట్ల లాభాలను ఆర్జించింది. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మహేష్ నటించిన గత చిత్రం '1' బాక్సాఫీసు వద్ద దారుణంగా దెబ్బతిన్నప్పటికీ ఆ ప్రభావం దీనిపై ఇసుమంతైనా పడకపోవడం విశేషం.
 
ఇందుకు ప్రధాన కారణం, ఇది 'దూకుడు' కాంబినేషన్ కావడమే. దర్శకుడు శ్రీను వైట్ల సినిమా అంటే ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ అనే ట్యాగ్ ఒకటుంది. దానికి తోడు, అలాంటి కథలను మహేష్ బాబు ఇరగదీస్తాడు. సునాయాసంగా మోసేస్తాడు.
 
ఈ కారణాల మూలంగానే ఈ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ జరుపుకుని లాభాలు మూటగట్టుకుంది. టాలీవుడ్ ట్రేడ్ లెక్కలను బట్టి చూస్తే, మొత్తానికి ఈ సినిమా 10 కోట్ల లాభాలను ప్రీ రిలీజ్ స్టేజ్ లోనే పొందింది. ఇటీవలి కాలంలో ఇదొక రికార్డుగానే చెప్పుకోవచ్చు. సినీ పండితులు అంటున్నారు.