గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (13:42 IST)

పవన్‌ వారసుడు సినీ ఎంట్రీ... ట్విట్టర్ లో రేణూ దేశాయ్

పవన్‌ కళ్యాణ్‌ వారసుడు రేణు దేశాయ్‌ కుమారుడు అకీరా తెరంగేట్రం చేసేస్తున్నాడు. వాళ్ళ అమ్మ మరాఠీలో నిర్మిస్తున్న 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే చిత్రంలో అకీరానందన్‌ ఓ చిన్న పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని రేణు దేశాయ్‌ ట్వీట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజైన ఈ రోజే ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం. 
 
ఇప్పటికే మెగా అభిమానులు హీరోలుగా వరుస కడుతున్నారు. ఇప్పుడు వారి కోవలో మరో వారసుడు తయారవుతున్నాడు. ఈ రోజే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్‌ విడిగా వుంటున్నా.. పవన్‌ కళ్యాణ్‌పై వున్న ప్రేమతో ఈ రోజే పెట్టడం విశేషం సంతరింతరించుకుంది. మాజీ భార్య మళ్లీ పవన్ చెంతకు చేరుతుందేమోననే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.