శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (11:28 IST)

అక్కను పక్కకు నెట్టిన చెల్లి... విశాల్ సరసకు అక్షర..

లోకనాయకుడు కమల్‌ హాసన్ కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లు వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య పోటాపోటీ ఏర్పడింది. తాజా సమాచారం ఏమిటంటే  పందెం కోడి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న విశాల్ దానికి సీక్వెల్‌గా పందెం కోడి2 సినిమాని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. పందెం కోడి సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు లింగుస్వామినే ఈ సీక్వెల్‌ని కూడా  రూపొందిస్తున్నారు.
 
అయితే ఈ సినిమాలో విశాల్ సరసన నటిస్తున్నట్టు సమంత పేరు వినిపించింది. ఆ తర్వాత శ్రుతి హసన్ నటిస్తుందన్నారు. అయితే  కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి శృతి హాసన్ చెల్లి అక్షర హాసన్ వచ్చి చేరింది. ఇప్పటికే అక్షర హాసన్ బాలీవుడ్ షమితాబ్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినది. ఇప్పుడు తొలిసారిగా కోలీవుడ్ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిందట.
 
విశాల్ సరసన పూజై సినిమాలో అక్క శ్రుతి హాసన్ నటించగా, తాజాగా పందెంకోడి-2లో చెల్లి అక్షరని ఎంపిక చేశాడు విశాల్. పందెంకోడి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మీరా జాస్మిన్ ఈ సీక్వెల్‌లోనూ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. విశాల్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి పాండిరాజ్ దర్శకత్వంలో కాగా, మరొకటి లింగుస్వామి డైరెక్షన్‌లో నటిస్తున్నాడు.