గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:38 IST)

తండ్రి సినిమాలో కూతురు... ఛాన్స్ కొట్టేసిన అక్షర..!

లోకనాయకుడు కమల్ హాసన్‌ కుమార్తెలుగా వెండితెరకు పరిచయమైన బ్యూటీలు శ్రుతి హాసన్, అక్షర. ఈ భామలు తండ్రితో కలిసి నటించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ మధ్య ఆయనతో కలిసి నటించే ఛాన్స్ శ్రుతికి వచ్చినా, డేట్స్ సమస్య వల్ల చేయలేకపోయింది. అయితే చిన్న కూతురు అక్షర మాత్రం ఆ ఛాన్స్ కొట్టేస్తోంది.
 
తాజాగా కమల్ హాసన్‌తో ఓ చిత్రం నిర్మించడానికి తమిళ హీరో ధనుష్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో అక్షరను కూడా నటింపజేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆమె కూడా ఆసక్తి చూపుతుండడంతో ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ నిర్వహిస్తున్నారు. ఇందులో ధనుష్ కూడా నటిస్తాడని సమాచారం. అయితే, దర్శకుడెవరనేది సస్పెన్సుగా వుంది.