శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (14:35 IST)

అఖిల్‌తో అలియా భట్ నో.. అఖిల్ సరసన నటించే కొత్త హీరోయిన్‌ ఎవరబ్బా?

హీరోగా మొదటి సినిమా మొదలుకాకుండానే బ్రాండ్ అంబాసిడర్‌గా అక్కినేని అఖిల్ దూసుకుపోతున్నాడు. అయితే హీరోయిన్స్ మాత్రం అఖిల్‌కు కరువయ్యారు. అఖిల్ మొదటి సినిమాకి హీరోయిన్ ఇంకా దొరకలేదు. దీంతో అఖిల్ అక్కినేని సరసన నటించే హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్‌గా మారిపోయింది. 
 
అఖిల్ నటించే చిత్రానికి హీరోయిన్ ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే అఖిల్‌కి స్టార్ ఇమేజ్ వచ్చేయడంతో తన తొలి సినిమాకు భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు వీవీ వినాయక్ దర్శకుడు కావడం మరింత క్రేజ్ వచ్చింది.
 
ఈ నేపథ్యంలో అఖిల్ సరసన కథానాయికగా నటింపజేసేందుకు హీరోయిన్ల వేట జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో వున్న హీరోయిన్లంతా అతనికంటే పెద్ద వాళ్లు కావడంతో ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ అలియా భట్ కోసం తీవ్రంగా ట్రై చేశారు.
 
కానీ, ఇప్పటికే తనకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఆమె డేట్స్ ఇవ్వలేనని చెప్పిందట. దీంతో ఇప్పుడు మళ్లీ ఎంపిక మొదటికి వచ్చిందట. అఖిల్ సరసన నటించే ఆ ఛాన్స్ మరి ఎవరికి వస్తుందో!