శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (18:05 IST)

ప్రియాంక బాటలో అలియా... మ్యూజిక్ ఆల్బంకు రెడీ..!

అప్పట్లో సినీ తారలు కేవలం నటనకు మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే నేడు నటీనటులు గానం, సంగీతం అంటూ పలు రంగాలలోను ప్రావిణ్యం పొంది, తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆ కోవలో ఆ మధ్య బాలీవుడ్ సెక్సీతార ప్రియాంకా చోప్రా 'ఎగ్జోటిక్' పేరిట ఓ మ్యూజిక్ ఆల్బం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. 
 
ఇప్పుడు ఆ కోవలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫాలో అవుతోంది. తాజాగా 'ఉడ్తా పంజాబీ' చిత్రం షూటింగుతో బిజీగా వున్న అలియా భట్ ఓ మ్యూజిక్ ఆల్బం రిలీజ్ చేసే ఆలోచనలో వుంది. వాస్తవానికి అలియా మంచి గాయని. ఇటీవల ఆమె 'హైవే', 'హమ్టీ శర్మా కీ దుల్హన్' చిత్రాలలో పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ధైర్యం తెచ్చుకున్న అలియా త్వరలోనే మ్యూజిక్ ఆల్బం చేయాలని డిసైడ్ అయిందట. అందుకు రెడీ అవుతున్నట్టు బాలీవుడ్ టాక్.