శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 జనవరి 2015 (16:14 IST)

నాన్నగారిని గుర్తుచేసేవారు... అల్లరి నరేష్‌

మా నాన్నగారు ఈవీవీ సత్యనారాయణగారంటే ఎమ్మెస్‌ నారాయణగారికి చాలా గౌరవం. తన జీవితాన్ని టర్న్‌ చేసిన ఘనత నాన్నగారిదేనని ఎప్పుడూ చెబుతుండేవారని సినీ హీరో అల్లరి నరేష్ అన్నారు. ఇంకా నరేష్ మాట్లాడుతూ.. మా ఈవీవీ సంస్థ నిర్మించిన పలు సినిమాల్లోనూ, నేను నటించిన చిత్రాల్లోనూ చేశారు. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న నటుడు. 
 
డైలాగులు చెప్పే విధానంలో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న వ్యక్తి. అతి తక్కువ కాలంలో 700కి పైగా సినిమాలు చేసిన కృషీవలుడు. తనవైన పాత్రలతో ప్రజలను నవ్వించిన ఆయన ఇక లేరనే వార్త తెలిసి బాధ కలిగింది. ఆయన లేని లోటు తీరనిది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.