బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2014 (12:40 IST)

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో షార్ట్ ఫిలిమ్!

అల్లు అర్జున్‌ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ప్రతిభ వున్నవారిని ప్రోత్సహిస్తూ వుంటారు. అందులో భాగంగానే సమాజం కోసం ఏమన్నా చేయాలనేది ఉద్దేశ్యంతో సమాజంలో చైతన్యం రగిల్చేందుకు తన స్వీయ నిర్మానంలో ఓ షార్ట్‌ ఫిలింలో నటిస్తున్నాడు. దీనికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
ఈ షాట్‌ ఫిలింను స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రముఖ హీరోలు ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు.

దాంతో అల్లు అర్జున్‌ చేస్తున్న ఈ కార్యక్రమానికి సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. మరి సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ షార్ట్‌ ఫిలిం ఎలా  వుంటుందో త్వరలో తెలుస్తుంది.