గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (16:58 IST)

బన్నీతో ఇంటిలిజెంట్‌ దర్శకుడు

అల్లు అర్జున్‌ సినిమాలంటే ఆర్య, ఆర్య-2 చిత్రాలు కాన్సెప్ట్‌ చిత్రంగా వుండేవి. ఇలాగా కూడా ఆలోచించి సినిమా తీవయచ్చా అంటూ... నెగెటివ్‌ షేడ్స్‌ పాజిటివ్స్‌ షేడ్స్‌ కలకలిపి చేసిన దర్శకుడు సుకుమార్‌. ఆయనంటే బన్నీకి చాలా ఇష్టం. అందుకే ఆయన కన్పించినప్పుడల్లా ఇంటిలిజెంట్‌ దర్శకుడని ముద్దుగా బన్నీ పిలుస్తుంటాడు.
 
మళ్లీ వారి కాంబినేషన్‌లో చిత్రం రాబోతుందని చూచాయిగా తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ రుద్రమదేవిలో కొత్తపాత్రను పోషిస్తుండగా ఆయనతో సినిమా చేయడానికి బోయపాటి శ్రీను వంటి వారు కూడా లైన్‌లో వున్నారు. కాగా, సుకుమార్‌... మహేష్‌ బాబుతో '1' నేనొక్కడినే సినిమా చేశాడు. ఆ సినిమా చూశాక... సుకుమార్‌ను బన్నీ ఎంతగానో పొగిడాడు.
 
అప్పుడు కమిట్‌ అయిన బన్నీ.... ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా సుకుమార్‌... ఇటీవలే పిఠాపురంలోని కాలేజీ ఫంక్షన్‌లో వెల్లడించారు. తానే నిర్మాతగా సినిమా చేస్తానని, హీరో అల్లు అర్జున్‌ వుంటాడని చెబుతున్నారు. మరోవైపు సుకుమార్‌ స్వంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి తన అసిస్టెంట్లను దర్శకులుగా చేస్తున్నారు. అయితే వారు చేసేది చిన్నపాటి హీరోలతో.. పెద్ద హీరోలతో అయితే సుకుమార్‌ రంగంలోకి దిగుతాడు.