శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (18:45 IST)

బన్నీ 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో విడుదల ఎప్పుడంటే...

అల్లు అర్జున్‌ను గతంలో 'జులాయి'గా చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అంటూ బన్నీని చూపించబోతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యమీనన్‌, ఆదాశర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ సినిమా ఆడియో మార్చి 8న విడుదలవుతోందని చెపుతున్నారు.
 
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మార్చి 8న రోజు బాగుండడంతో ఆ రోజున ఆడియోను ఆవిష్కరించనున్నారు. కాగా గతంలో బన్ని-త్రివిక్రమ్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి ఆడియో పెద్ద హిట్ అయ్యింది. దీంతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఆడియోతో పాటు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.