మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 21 జూన్ 2014 (19:59 IST)

'అల్లుడు శీను'లో సమంత ఎక్స్ పోజింగ్... తమన్నా స్పెషల్ సాంగ్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'అల్లుడు శ్రీను'. సమంత కథానాయిక.  బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బెల్లంకొండ గణేష్‌ బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 29న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తుంది. శనివారం  హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లుడుశీను టైటిల్‌ను అధికారికంగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ... హీరోకి మంచి లాంచ్‌ ఈ సినిమా. అనుకున్నట్లుగానే అవుట్‌పుట్‌ బాగా వస్తుంది. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. దాదాపుగా చిత్రీకరణ పూర్తయ్యింది. మేము అడగ్గానే తమన్నా ప్రత్యేకగీతంలో నర్తించింది. విక్టరీ వెంకటేష్‌ తొలి సినిమా కలియుగ పాండవులు సినిమాని అప్పట్లో డా|| డి. రామానాయుడుగారు టాప్‌ టెక్నిషియన్స్‌తో ఎలా రూపొందించారో అలాగే బెల్లంకొండ సురేష్‌గారు కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 
సాయిశ్రీనివాస్‌, బ్రహ్మానందంల మధ్య సన్నివేశాలు సినిమాకి హైలైట్‌ అవుతాయి. వారిద్దరి మధ్య గల సన్నివేశాల్లో ఎక్కువగా అల్లుడుశీను అనే పదం రిపీట్‌ అవుతుంది. అందుకే అల్లుడుశీను టైటిల్‌ పెట్టాం. సినిమాలో ఫన్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్ని ఉన్నాయి అన్నారు.
 
జూలై 24న విడుదల...  బెల్లంకొండ సురేష్‌ 
అల్లుడు శీను సినిమాతో మా సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాను. నేను ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేసిన వి.వి.వినాయక్‌, సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేయడం అనందంగా ఉంది. దర్శకుడిగా అవకాశం ఇచ్చాననే కృతజ్ఞతను ప్రతి విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు వినాయక్‌. ఈ రోజుల్లో కొందరికి ఆ విశ్వాసమే ఉండట్లేదు. ఐదేళ్ళ క్రితమే మీ అబ్బాయిని హీరోగా లాంచ్‌ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటకి కట్టుబడి చక్కని కథతో ఈ సినిమా చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌, కోనవెంకట్‌, చోటా కె.నాయుడు, గోపిమోహన్‌ వంటి టాప్‌ టెక్నిషియన్స్‌ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఈ నెల 29న పాటల్ని విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై 24న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం అని తెలిపారు.
 
రచయిత కోనవెంకట్‌ మాట్లాడుతూ...
ఒక శాటిలైట్‌ను విడుదల చేయాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని లాంఛ్‌ చేస్తారో అలాంటి జాగ్రత్తలతో సురేష్‌గారు సాయిశ్రీనివాస్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. తనని ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్‌గారి అబ్బాయిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను తీసుకుని చక్కగా సినిమాని రూపొందిస్తున్నారు. నాయక్‌ వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత కొత్త హీరోగా పరిచయం అవుతున్న సాయిశ్రీనివాస్‌ను పరిచయం చేస్తున్న వినాయక్‌ను ఈ సందర్భంగా అభినందించాలి. సినిమాలో అన్ని హంగులున్నాయి. బ్రహ్మానందం కామెడి సినిమాకి ప్లస్‌ అవుతుంది. సినిమాకి టాప్‌ మోస్ట్‌ టెక్నిషియన్స్‌ పనిచేస్తున్నారు అని తెలిపారు. కాగా ఈ చిత్రంలో సమంత ఎక్స్ పోజింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
 
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు: బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్లభరణి, ప్రదీప్‌రావత్‌, రఘుబాబు, వెన్నెలకిషోర్‌, వేణు,రవిబాబు, ప్రవీణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎడిటర్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, సాహిత్యం: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, స్టంట్‌శివ, రవివర్మ, వెంకట్‌, డాన్స్‌: రాజసుందరం, ప్రేమ్‌ రక్షిత్‌, గణేష్‌, శేఖర్‌, కథ: కె.యస్‌.రవీంద్రనాథ్‌(బాబీ), కోనవెంకట్‌, డైలాగ్స్‌: కోనవెంకట్‌, సినిమాటోగ్రఫీ: చోటా కె.నాయుడు, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌ బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.