బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 మే 2015 (16:03 IST)

అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్: ప్రభుదేవా- విజయ్ సినిమాలో..

సహజమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అమలాపాల్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు విజయ్‌ని ఆమె ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆ తరువాత ఆమె నటించదనే అంతా అనుకున్నారు. అలాంటి అంచనాలను తలకిందులు చేసేందుకు అమలాపాల్ రెడీ అవుతోంది. అదీ తన భర్త దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఒక సినిమాలో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.  
 
తాజాగా సూర్య కథానాయకుడిగా చేస్తోన్న 'హైకు' చిత్రంలో అమలాపాల్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుదేవా కథానాయకుడిగా తన భర్త తెరకెక్కించనున్న సినిమాలోనూ నటించనున్నట్టు తెలుస్తోంది. విశేషమేమిటంటే, దర్శకుడైన ప్రభుదేవా నిర్మాతగా ఈ సినిమాను విజయ్‌తో చేయడం, ఈ సినిమాలోని ఈ పాత్రకి అమలాపాల్ అయితేనే బాగుంటుందని ప్రభుదేవా సూచించారట. దీంతో అమలాపాల్ రీ ఎంట్రీకి ముహూర్తం దగ్గరపడిందన్నమాట.