శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (11:45 IST)

మన్మథుడికి మరదలిగా అనసూయ.. స్ర్కీన్ కెమిస్ట్రీ..

మన్మథుడికి మరదలిగా అనసూయ నటిస్తోంది. అనసూయ ఎవరో కాదండీ.. హాట్ యాంకర్ అనసూయ. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని లేటెస్ట్ ఫిల్మ్‌నగర్ టాక్.
 
నాగార్జున, అనసూయల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని సినీ యూనిట్ ఆమెను ఎంపిక చేసింది. ఓ పాటలో నాగార్జునతో కలిసి అనసూయ స్టెప్పులు కూడా వేస్తుందని సమాచారం. 
 
కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హంసానందిని కీలక పాత్రలో కనిపించనుంది. 
 
ఈ సినిమాకు ‘ఉయ్యాల జంపాలా’ నిర్మాత రాధామోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలోబ్రదర్’ తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.