శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (12:54 IST)

ఫామ్‌లోకి వచ్చిన అంజలి : సుబ్బరాజ్ సినిమాలో సీతమ్మ!

వ్యక్తిగత సమస్యలను పక్కనబెట్టేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం బంపర్ ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ అమ్మడు బిగ్ ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా అంజలి భారీ ప్రాజెక్టులో సంతకం చేసిందని టాక్. జాతీయ అవార్డు గ్రహీత, డైరక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించే సినిమాలో అంజలి కీలక పాత్ర పోషిస్తోందని తెలిసింది.
 
తమిళ దర్శకుడు, సలీమ్ హీరో విజయ్ సేతుపతికి జంటగా అంజలి ఈ మూవీలో నటించబోతోంది. ఇకపోతే.. ఈ చిత్రంలో బాబీ సింహా, ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్యలు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుందని సినీ యూనిట్ వర్గాల సమాచారం.