మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (19:16 IST)

అనుష్క రుద్రమదేవి ట్రైలర్ రిలీజ్... రుద్రమదేవిగా అనుష్క అదుర్స్...

టాలీవుడ్ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో తెరకెక్కిస్తున్నరుద్రమదేవి థియేటర్ ట్రైలర్ విడుదలై౦ది. గుణశేఖర్ ప్రకటించినట్లుగానే రుద్రమదేవి ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో అనుష్క రుద్రమదేవిగా పవర్‌ఫుల్ గా అగుపించింది.

 
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ... పదేళ్ళనుంచి ఇండస్ట్రీలో ఏదో కొత్త ప్రయోగం చేయాలని ఎదురుచూస్తున్నాను. అది రుద్రమదేవితో నెరవేరింది. ఈ చిత్రంలో చేసినందుకు గర్వపడుతున్నానని తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన 3డి థియేట్రికల్‌ ట్రైలర్‌ ప్రీమియర్‌ను హైదరాబాద్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను హీరోయిన్‌ అనుష్క లాంచ్‌ చేశారు. 
 
అనుష్క మాట్లాడుతూ... ట్రైలర్‌ అద్భుతంగా వుంది. సైనికులంతా ఈగిల్‌ షేప్‌లో చేసిన విధానం అద్భుతంగా వుంది. నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. గుణశేఖర్‌ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారు. రుద్రమదేవిగా నటించడం నేనెంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఇంతకుముందు నేను చేసిన సినిమాలను ఎంతో ఆదరించిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరించి సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.