బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:22 IST)

అవకాశమిస్తే.. శంకర్ చిత్రంలో నటించేందుకు సిద్ధం : ఆర్నాల్డ్

తనకు అవకాశమిస్తే దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో నటిస్తానని హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ తన మనస్సులోని మాటను వెల్లడించారు. ఇందుకోసం శంకర్ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన 'ఐ' ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్నాల్డ్ వచ్చిన విషయం తెల్సిందే. ఇదే మాటను నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ సోదరుడు ఆర్నాల్డ్‌ను కలిసినప్పుడు కూడా చెప్పారు. శంకర్‌ కోసమే నేను చెన్నై వస్తున్నట్లు ఆర్నాల్ ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో చాలా ప్రాంతాలకు వెళ్ళాను. కానీ చెన్నై రావడం ప్రథమం. శంకర్‌తో ఓ సినిమా చేయాలనుంది. గతంలో నేను చేసిన 'కెనాన్‌ డిక్కింగ్‌'కు సీక్వెల్‌గా చిత్రాన్ని చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడుతూ... శంకర్‌ 'ఐ' ఇప్పుడు హాలీవుడ్‌పై పడిందని చమత్కరించారు. భారత సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్ళాలనే ఆలోచనలో శంకర్‌ వున్నాడని తెలిపారు.
 
దర్శకుడు శంకర్‌ తెలుపుతూ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమని కితాబిచ్చారు. విక్రమ్‌ మాట్లాడుతూ మనిషి మృగం లాంటి గెటప్‌ వేసుకోవడానికి మూడు గంటలు పట్టింది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో వుండేవాడిని.. ఇదొక ఛాలెజ్‌గా స్వీకరించాను. భారత సినీ చరిత్రలో మైలురాయిలా ఈ చిత్రం నిలిచిపోతుందని చెప్పాడు.