గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (15:18 IST)

బాహుబలి టీమ్ పేకప్.. అవుట్‌డోర్ వెళ్దాం!: రాజమౌళి

బాహుబలి లేటెస్ట్ షూటింగ్ వివరాలు ఏంటంటే.. ఈ మూవీ టీమ్ త్వరలో అవుట్‌డోర్ వెళ్తోందట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతోంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు భారీ సెట్లలో బాహుబలి షూటింగ్ జరుపుకుంటోంది. 
 
ఇప్పటివరకు రాష్ట్రాన్ని దాటని బాహుబలి త్వరలో అవుట్‌డోర్‌ వెళ్లనున్నాడు. ఆగస్ట్ 26 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్ పూర్తయ్యాక అవుట్‌డోర్ వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం 60 శాతం షూటింగ్ పూర్తికాగా, 2015 ఏప్రిల్ తర్వాత బాహుబలి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బాహుబలిలో అనుష్క, రానా, అల్లు అర్జున్, కేథరిన్, నాజర్, సత్యరాజ్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. కాగా బాహుబలి అత్యాధునిక 3డీ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.