శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (18:20 IST)

బాహుబలి ఆడియో రిలీజ్‌కు రజనీ కాంత్: జక్కన్న సినిమాలో ఛాన్స్ ఇచ్చారా?

భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి ఆడియో ఆవిష్కరణ మే 31న జరగనుంది. ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ బాహుబలిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ రజనీకాంత్ బాహుబలి సినిమాలో నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. గత ఏడాది రజనీకాంత్ బాహుబలి షూటింగ్ స్పాట్ సందర్శించినప్పటి నుంచి ఈ రూమర్స్‌ షికార్లు చేస్తునే వున్నాయి. 
 
రానా, ప్రభాస్, తమన్నా, అనుష్క, సత్యరాజ్ వంటి స్టార్ హీరోల నుంచి చిన్న కళాకారుల వరకు బాహుబలిలో ఛాన్సిచ్చిన రాజమౌళి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా ఒక వేషం ఇచ్చే వుంటారని టాక్ వస్తోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. బాహుబలి ఆడియో రిలీజ్‌ వేడుకకు మాత్రం రజనీకాంత్ హాజరవుతున్నారని తెలిసింది. భారత సినీ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచిపోనున్న రాజమౌళి బాహుబలి సినిమా ఆడియో రిలీజ్ మే 31వ తేదీన అట్టహాసంగా జరుగనుంది. రాజమౌళి బ్రదర్ ఎంఎం కీరవాణి సమకూర్చిన పాటలకు మంచి క్రేజ్ లభిస్తుందని ఇప్పటికే టాక్ వస్తోంది. 
 
8 మంది రచయితల లిరిక్స్‌‍తో 8 పాటలను కీరవాణి కంపోజ్ చేశారు. బాహుబలి ఆడియో హక్కులను రూ.3కోట్లకు లాహరి కైవసం చేసుకుంది. తమిళం, తెలుగులో వస్తున్న బాహుబలి పాటల రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరుగనుంది. ఈ వేడుకకు రజనీకాంత్‌తో పాటు కరణ్ జోహార్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారని తెలిసింది.