శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (18:23 IST)

జీవితకి రెండేళ్ళ జైలు... కోర్టు బెయిల్ మంజూరు చేసింది...

టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ భార్య, నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌కి రూ. 22 లక్షల చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు విధించిన నేపధ్యంలో ఆమె ఆ డబ్బు చెల్లించడంతో బెయిల్ మంజూరయింది. కోర్టు తీర్పు వెలువరించగానే మధ్యాహ్నం జీవిత వెనువెంటనే 25 లక్షల రూపాయల జరిమానాను చెల్లించేసింది. దీంతో ఎర్రమంజిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 
కాగా నటి జీవిత 'ఎవడైతే నాకేంటి' సినిమా సమయంలో నిర్మాత శేఖర్‌కు 22 లక్షల చెక్‌ను ఇచ్చింది. అది కూడా బౌన్స్‌ అయింది. ఇది జరిగి రెండేళ్ళయింది. కానీ ఇంతకువరకూ సరైన క్లారిటీ రాలేదు. దాంతో కేసు వేయడంతో దానిపై సోమవారం తీర్పు వచ్చేసింది.
 
హైదరాబాద్‌లో ఎర్రమంజిల్‌ కోర్టు ఆమెకు రూ.25 లక్షలతో పాటు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీనితో ఆమె అవాక్కయింది. వెంటనే కోర్టుకు 25 లక్షలు చెల్లించడంతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు.