గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (15:33 IST)

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా టైటిల్ ఖరారు..!

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ చిత్రం వస్తుందంటే అంచనాలు మెండుగానే ఉంటాయి. అదగొట్టే డైలాగులతో అటు కుటుంబ సభ్యులను, ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సినిమాలు ఉండడం ఆయన స్పెషాలిటీ.
 
బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో హిట్టు సాధించిన సినిమాలు 'సింహ' , 'లెజెండ్'. ఈ సినిమాలతో బాలయ్యకు మంచి పేరు రావడమే కాకుండా కలెక్షన్లను కుమ్మరించాయి. ఇప్పుడు మరొకసారి బోయపాటి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాణంలో బాలయ్య నటించబోతున్నాడు.
 
వారాహి ప్రొడక్షన్ బ్యానర్ లో బోయపాటి శీను దర్శకత్వంలో బాలయ్య 100వ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకి 'చరిత్రకొక్కడు' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. బోయపాటి దర్శకత్వంలో నటించిన బాలయ్య సినిమాలు అన్నీ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఈ చిత్రం తప్పక హిట్టుకొడుతుందని సినీ యూనిట్ అభిప్రాయం.