శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 7 ఫిబ్రవరి 2015 (18:20 IST)

బాలయ్య 99 రెడీ... 100వ సినిమా కోసం కసరత్తు...

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా కోసం ఇప్పటికే కసరత్తు జరుగుతున్నాయి. ప్రముఖ రచయితలంతా ఆయనకు ఓ కథను చెప్పడం జరిగింది. బోయపాటి శ్రీను కూడా దాన్ని డీల్‌ చేయాలని గతంలో చెప్పాడు కూడా. కాగా, ఇప్పుడు 98వ చిత్రం 'లయన్‌' రాబోతుంది. ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత 99వ చిత్రం కోసం ఇప్పటికే గోపీమోహన్‌, కోన వెంకట్‌ రాస్తామని కర్చీఫ్‌ కూడా వేసేశారు.
 
గతంలో బాలయ్యకు కథలు రాయాలంటే.. వారు ఆలోచించేవారు. కానీ ఎంఎల్‌ఎ అయ్యాక రచయితలు ఆలోచనలు మారాయని తెలుస్తోంది. బాలయ్య బాధ్యతతో కూడిన పదవిలో వున్నాడు గనుక ఆ కాన్సెప్ట్‌తో ఓ కథను రాసుకున్నారట. దానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు తెలిసింది. దీనికి లౌక్యం దర్శకుడు శ్రీవాస్‌ దర్శకత్వం వహించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.