గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (10:43 IST)

'త్వరలో తాతను కాబోతున్నా'.. బాలయ్య ప్రకటన..!

టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘‘త్వరలోనే తాతను కాబోతున్నాను’’ అంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఆయన అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించింది. తూర్పు గోదావరి జిల్లా తునిలో బుధవారం రాత్రి జరిగిన స్నేహితుడు చల్లకొండ రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.
 
ఆ సమయంలో బాలయ్య, త్వరలోనే తాను తాతను కాబోతున్నానంటూ ప్రకటించారు. బాలయ్య ప్రకటనతో అక్కడున్న ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. బాలయ్య తన పెద్ద కుమార్తె బ్రాహ్మణిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కిచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. 
 
బ్రాహ్మణి గర్భవతి అంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వినిపించాయి. తాజాగా బాలయ్య ప్రకటనతో ఆయనతో పాటు సీఎం చంద్రబాబు కూడా త్వరలోనే తాతలు కానున్నారు.