గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 26 జూన్ 2015 (15:46 IST)

ఆల్ ఇండియా రికార్డుని సృష్టించిన నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’

నందమూరి నటసింహం బాలకృష్ణ నటవిశ్వరూపాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి రికార్డులను తిరగ రాస్తున్న చిత్రం ‘లెజెండ్’. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిచిన ఈ చిత్రం మార్చి 28, 2014న విడుదలై 456 రోజులను పూర్తిచేసుకుంటుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో సింగిల్ షిఫ్ట్‌తో ఆర్వేటిలో 56 రోజులు, అర్చనలో 400 రోజులను పూర్తిచేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.
 
4 ఆటలతో 456 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకున్న చిత్రంగా ‘లెజెండ్’ ఆల్ ఇండియా రికార్డుని క్రియేట్ చేసింది. డిజిటల్ ప్రదర్శనలో అత్యధిక రోజుల ప్రదర్శితమవుతున్న చిత్రంగా కూడా ‘లెజెండ్’ మరో మైల్‌స్టోన్‌ను అందుకుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘లెజెండ్’ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాయడంతో పాటు బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. 
 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రాధికా అప్టే, సోనాల్ చౌహాన్ గ్లామర్ ప్లస్ అభినయాలతో పాటు ఫ్యామిలీ హీరో టర్న్ డ్ విలన్ జగపతి బాబు ప్రతి నాయకుడిగా నటించడం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.లెజెండ్ చిత్రం రికార్డ్ విజయాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ప్రొద్దుటూరులో ఘనంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.