గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 28 జనవరి 2015 (22:01 IST)

బాలయ్య యాక్షన్‌లో వున్నాడు!

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్‌'... ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లు, సత్యదేవా దర్శకుడు. 
 
రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ చిత్రంలోని కాన్సెప్ట్‌ సమకాలీన సమస్యలపై లయన్‌లా ఎదురుతిరిగే పాత్రను బాలయ్య పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్‌ వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేయనున్నారు. మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. మార్చిలో సినిమాను విడుదల చేయనున్నారు.