బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:14 IST)

'లయన్' విడుదల వాయిదా.. మే 7గా తేదీ ఖరారు..!

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లయన్'. ఈ చిత్రాన్ని తొలుత మే ఒకటో తేదిన విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత ప్రకటించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను మే నెల ఏడో తేదికి వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరాయి. 
 
బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు సత్యవేద్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇందులో ఒక పాత్ర సీబీఐ ఆఫీసర్ కావడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు.