శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:36 IST)

బాలకృష్ణ లయన్ ఎప్పుడొస్తుందో తెలుసా?

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ''లయన్'' సినిమా కోసం నందమూరి హీరోలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ప్రేక్షకుల ముందుగా వస్తుందని బాలయ్య సన్నిహితులు అంటున్నారు. 
 
లయన్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందని, సమ్మర్లో బాలయ్య లయన్ తెరపైకి వస్తుందని సమాచారం. బాలయ్య లయన్‌ను సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు కారణం లేకపోలేదని సినీ యూనిట్ చెబుతోంది. 
 
అదేంటంటే.. లెజండ్ మూవీ మార్చి 28న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందించింది. అందుచేత లయన్ మేకర్స్ ఈ చిత్రాన్ని అదే డేట్ అంటే మార్చి 28 2015న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.