శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (16:52 IST)

ఏదో ఏదో అన్నది... ఈ మసక వెలుతురు... గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు...( వీడియో)

తెలుగు హృదయంలో తీపి జ్ఞాపకాలను వెండితెరపై ఆవిష్కరించిన బాపు సుదూర తీరాలకు వెళ్లిపోయారు. ఆయన రూపొందించిన ఒక్కో సినిమా ఓ దృశ్య కావ్యమే. సహజత్వం, అచ్చతెనుగు అందం ఆయన కథా వస్తువులు. ఆయన తీసిన చిత్రాల్లో ఏ పాట విన్నా హృదయం కొత్త అనుభూతికి లోనవుతుంది. 
 
మచ్చుకు.... ముత్యాలముగ్గు చిత్రంలో ఏదో ఏదో అన్నది... అంటూ సాగే పాటలో గీత రచయిత ఆరుద్ర గారు కొత్త జంట భావాలను ఆవిష్కరిస్తే, కె.వి.మహదేవన్ ఆ భావాలకు రాగాలను మీటుతూ తెలుగు గుండెల్ని తాకితే.... వి.రామకృష్ణ ఆలపించిన పాటలో నటుడు శ్రీధర్ నటి సంగీతలు అభినయాల అందమైన దృశ్యరూప రాగ మాలికను తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మీటిన దర్శకుడు బాపు. ఆయన చిత్రించిన ఆ పాటను ఈ వీడియోలో చూద్దాం.... యూ ట్యూబ్ నుంచి...