గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Eswar
Last Modified: గురువారం, 24 జులై 2014 (19:15 IST)

సల్మాన్ ఖాన్ 'కిక్' టీజర్ ను చూసిన ఒబామా

సల్మాన్ ఖాన్, జాక్విలెన్ ఫెర్నాండెజ్ నటించిన 'కిక్' టీజర్ ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టిస్తోంది. టీజర్‌ను రెండు కోట్ల మంది ఇప్పటికే నెట్‌లో వీక్షించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో అందరనీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. కిక్ సినిమాలో జుమ్మాకే రాత్ అనే పాటను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన గదిలో చూస్తున్నట్టుండే ఫోటో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
 
ఇంతకీ ఏమా కథా అంటారా?? దానికి చిత్ర నిర్మాతలే చెప్పేస్తున్నారు సమాధానం. అదంతా ఫేక్... మార్ఫింగ్ ఫోటో అని. ఇంతకీ ఫోటోషాప్‌లో మార్ఫింగ్ చేసి నెట్‌లో పెట్టింది ఎవరో అభిమానులు కాదట. చిత్ర యూనిట్‌కు సంబంధించిన వ్యక్తులే ఈ పని చేశారట. ఎందుకంటే సల్మాన్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులకి మరింత సర్‌ప్రైజ్ ఇచ్చేందుకే  ఈ పనిచేసినట్లు చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
 
ప్రపంచ వ్యాప్తంగా రేపట్నుంచి థియేటర్లలో సందడి చేయనున్న కిక్ సల్మాన్ అభిమానుల్ని అలరించనుంది. సల్మానా మజాకానా.. సల్లూ భాయ్ తలచుకుంటే అమెరికా అధ్యక్షుడైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే మరి...