శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 10 సెప్టెంబరు 2014 (14:35 IST)

కోటి ఆశలపై శివాజీ నీళ్ళు జల్లాడు... బూచమ్మ బూచాడు డైరెక్టర్ ఆవేదన

ఇండస్ట్రీలోకి కోటి ఆశలతో వచ్చాను. పదవ తరగతినుంచి దర్శకత్వ శాఖలోనే పనిచేశాను. 13 ఏళ్లకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. కానీ దాన్ని నటుడు శివాజీ నీరుగార్చేశాడు. అంతా తానే చేసినట్లు చెప్పుకుంటూ.. దర్శకుడిని అనేవాడిని చీపురుపుల్లలా చూస్తున్నాడంటూ.... 'బూచమ్మ బూచోడు' చిత్రం దర్శకుడు రేవన్‌ యాదగిరి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన బుధవారంనాడు ఈ విధంగా స్పందించారు.
 
నేను పోసాని దగ్గర ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేశాను. గుణశేఖర్‌గారి పరిచయంతో ఆయన దగ్గర అసోసియేట్‌ నుంచి అసిస్టెంట్‌ వరకు చేశాను. 'బాల రామాయణం' నుంచి అన్ని చిత్రాలకు పనిచేశాను. నాలుగేళ్ళ నుంచి ఓ కథను అనుకుని.. పలువురు నిర్మాతలను కలిశాను. బెక్కెం వేణుగోపాల్‌గారిని సంప్రదించాను. ఆ తర్వాత శివాజీ కలిశారు. ఆయనతో సినిమా చేయాలనుకుని కథ చెప్పడం. ఆయనే ఇద్దరు నిర్మాతలను తీసుకురావడం జరిగింది. అయితే 18 నెలల కష్టానికి కనీసం పేరు రాకుండా శివాజీ అడ్డుపడుతున్నారు. 
 
క్లోజ్‌ షాట్‌ అంటే కూడా తెలీదు.. 
దర్శకుడిగా ఏ సీన్‌కు ఎలా చేయాలనేది తెలుస్తుంది. ప్రతి సీన్‌లోనూ ఇన్‌వాల్వ్‌ అయి అదెందుకు? ఇదెందుకు? అనేవాడు శివాజీ. సరియైన లైటింగ్‌ ఇచ్చేవాడు కాదు. నిర్మాతలు ఆయనకు డబ్బులు ఇచ్చి సినిమా తీయమని చెప్పారు. దాంతో ఆయన టెక్నీషియన్స్‌కు ఎవ్వరికీ డబ్బులు ఇచ్చేవాడు కాదు. మూడునెలలకు నాకు లక్షరూపాయలు ఇచ్చాడు. అదికూడా అడగ్గా అడగ్గా ఇచ్చేవాడు. రోజూ నా బైక్‌ మీదనే లొకేషన్‌కు వెళ్ళేవాడిని. సీన్‌కు తగినట్లు షాట్‌ తీయాలంటే.. ప్రతిదానికి ఎందుకు? సరిపోతుందిలే అనేవాడు. 
 
శివాజీ లేకపోతే సినిమా పెద్దహిట్‌ 
టీవీ9కు చెందిన వారు ఇద్దరు ఈ చిత్రాన్ని టేకప్‌ చేశారు. దాంతో టీవీల్లో ఆయనే కనబడేవారు. దర్శకుడిగా నా వాయిస్‌ చెప్పాలని అడిగితే.. 'టీవీ వారికి హీరోహీరోయిన్లే కావాలంటా?' అంటూ మెసేజ్‌లు పంపేవాడు. ఇలా అడుగడుగునా ఆయన అడ్డుపుల్ల వేసేవారు. నటీనటుల్ని,. టెక్నీషియన్స్‌ కూడా నా పరిచయంతోనే నేను తెచ్చుకున్నాను. పోసాని, బ్రహ్మానందంలను కూడా నేనే తీసుకువచ్చాను. మొదటి సినిమా జాగ్రత్తగా చేసుకో అనేవారు. 
 
కానీ ఆ క్రెడిడ్‌ అంతా తానేనని శివాజీ చెప్పడం హాస్యాస్పదంగా వుంది. ఈ చిత్రంలో శివాజీ లేకపోతే పెద్ద హిట్‌ అయ్యేదని చాలామంది అన్నారు. నేనూ అదే ఫీలవుతున్నాను. ఇలాంటివారి వల్ల దర్శకులుగా ఈ రంగంలోకి రావాలనుకునేవారికి పెద్దనీతి చెప్పినట్లుందని వాపోయారు. తెలంగాణలోని చిలుకూరు గ్రామంలో పుట్టి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేసి పెరిగిన రేవంత్‌ యాదగిరి.