బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:42 IST)

'ఒక లైలా కోసం': మొదటి రోజు కలెక్షన్ రూ.5కోట్లు!

యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య హీరోగా 'గుండెజారి గల్లంతయ్యిందే' ఫేం విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో కింగ్‌ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించిన 'ఒక లైలా కోసం' అక్టోబర్‌ 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా చిత్రం మొదటి రోజు 5 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. 'మనం' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత 'ఒక లైలా కోసం' నాగచైతన్యకు మరో సూపర్‌హిట్‌ చిత్రం అయింది. నాగచైతన్య సోలో హీరోగా నటించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో 5 కోట్లు కలెక్ట్‌ చేయడమే కాకుండా నాగచైతన్య కెరీర్‌లో నెంబర్‌ 1 చిత్రంగా నిలిచింది. 
 
నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంలో ఆలీ, షాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.