శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (14:38 IST)

వెండితెరకు మరో నట వారసుడు.... త్వరలో ఎంట్రీ..!

సినీ రంగంలో పేరు పొందిన నటీ, నటులు తమ పిల్లలను కూడా సినీ వారసులుగా వెండితెరకు పరిచయం చేస్తుంటారు. వారిలో కొందరు తారాస్థాయికి ఎదిగిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ కోవలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరో నట వారసుడు రాబోతున్నాడు. ప్రముఖ తెలుగు సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆ మధ్య పెళ్లి చేసుకున్న సంజయ్ మర్చెంట్ నేవీలో పని చేస్తున్నాడు. 
 
అయితే సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ప్రస్తుతం నటనలో ట్రైనింగ్ పొందుతున్నాడు. ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు ఇతగాడిని చూసి తన సినిమాలో ఓ పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. అయితే బ్రహ్మాజీ తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగాను, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం. ఇక సంజయ్ హీరోగా రాణిస్తాడో లేక నటుడిగా ఫేమస్ అవుతాడో వేచి చూడాల్సిందే.