శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శుక్రవారం, 18 జులై 2014 (20:54 IST)

నేనేం మంచిపనులు చేయలేదు... కుక్కగా పుడతానేమో... బ్రహ్మానందం

మనిషి అన్నాక ఏవో మంచి పనులు చేయాలి. లేదంటే వచ్చే జన్మలో ఏ జంతువుగానో పుడతాడని చెబుతుంటాయి పురాణాలు. అందులో ఎంత నిజముందో తెలీదుకానీ.. నేను మాత్రం మళ్ళీ మనిషిగా పుడతాననుకోవడంలేదు. ఎందుకంటే నేను చెప్పుకోదగిన మంచి పనులు చేయలేదని నటుడు బ్రహ్మానందం తన గురించి నిజాన్ని చెప్పేశాడు.
 
ఇప్పటికే ఇండస్ట్రీలో ఆయనపై చాలా కథనాలు వున్నాయి.. అది అలాఉంటే... గురువారం రాత్రి ఆయన 'గీతాంజలి' చిత్రంలో ప్రమోషన్‌ సాంగ్‌ చేశారు. ఆ పాటను హైదరాబాద్‌లో లాంఛ్‌ చేశారు. కోన వెంకట్‌ సమర్పిస్తున్న ఆ చిత్రం  ప్రమోషన్‌లో భాగంగా ఆయన హాజరయ్యారు. సభకు వచ్చిన వారంతా ఆయన్ను తెగ పొగిడేస్తున్నారు. బ్రహ్మానందం అది, బ్రహ్మానందం ఇది... ఆయన ఇంద్రుడు, చంద్రుడు అంటూ తెగ పొగిడారు. ఆ తర్వాత ఆయన మైక్‌ పట్టుకుని... పైవిధంగా మాట్లాడారు.
 
మరుజన్మ ఉందో లేదో తెలీదు.. వుంటే గనుక మనిషి జన్మలో పుట్టి అందర్నీ నవ్వించినట్లే... వచ్చే జన్మ అనేది ఉంటే... మళ్ళీ మనిషిగా పుట్టాలని అనుకోవడంలేదు. ఎందుకంటే నేను పుణ్యాలు ఏమీ చేయలేదు. ఒకవేళ పుడితే.. ఏ కుక్క గానో.. మరో జంతువుగానో పుట్టినా.. తోటి జంతువులను నవ్వించేట్లుగా పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది కాస్త ఆశ్చర్యం కల్గించినా.. బ్రహ్మానందమే అన్నాడు కాబట్టి అందరూ చప్పట్లు కొట్టారు.