శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (17:16 IST)

పిల్లలపై అశ్రద్ధ వహిస్తే ఎదురయ్యే పరిణామాలే.. బుడుగు..: రివ్యూ రిపోర్ట్ ఇదే!

ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి తాజా చిత్రం ''బుడుగు''. ఇందులో ఈమె తల్లిపాత్రను పోషించింది. ఈ చిత్రంలో కొడుకు కోసం ఆరాటపడే తల్లిగా మంచు లక్ష్మీ ఆకట్టుకుంది. విడుదలకు ముందే అంచనాలను పెంచిన ''బుడుగు'' రివ్యూ రిపోర్టు మీ కోసం.
 
చిత్ర కథ :  
ఎటువంటి జబ్బునైనా నయం చేసే శక్తి కేవలం తల్లితండ్రుల స్పర్శకి, ప్రేమకి ఉందని అంటారు. అటువంటిది తల్లితండ్రుల నుంచి సరైన ప్రేమ పిల్లలకు దొరకకపోతే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడమే ఈ బుడుగు. ఇక కథ విషయానికి వస్తే ఓ హైఫై జాబ్ చేస్తూ మంచి స్థాయిలో సెటిల్ అయిన కుటుంబ పూజ (మంచు లక్ష్మి) - రాకేశ్ (శ్రీధర్ రావు)లది. వారి పిల్లలు బన్నీ (మాస్టర్ ప్రేమ్), ఆపిల్ (బేబీ డాలీ).
 
చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ సరిగా లేకపోవడంతో బన్నీ అందరికన్నా కాస్త డిఫరెంట్‌గా పెరుగుతాడు. దాంతో బన్నీ సరిగ్గా లేడని బోస్టన్ స్కూల్‌లో వేస్తారు. ఆ బోస్టన్ స్కూల్‌లో కూడా బన్నీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే చనిపోయిన దియా తనతో మాట్లాడుతుందని చెబుతాడు. దాంతో పూజ, బన్నీని చైల్డ్ సైకలాజిస్ట్ అయిన గీత రెడ్డి (ఇంద్రజ) దగ్గరికి తీసుకెళ్తుంది.
 
అక్కడి నుంచి ఏమి జరిగింది? అసలు సైకాలజిస్ట్ ఏమి చెప్పింది? బన్నీ ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? ఏ కారణం చేత బన్నీకి దియా కనబడుతుంది. అబ్ నార్మల్‌గా బిహేవ్ చేసే చిన్నారి మాములు మనిషి అయ్యాడా? లేదా? వంటి విషయాలను వెండితెరపై చూడాల్సిందే.
 
సినిమా : బుడుగు 
తారాగణం : మంచు లక్ష్మి , శ్రీధర్ రావు , మాస్టర్ ప్రేమ బాబు , బేబీ డాలీ , ఇంద్రజ , సన , ఇందు ఆనంద్ , శైలజావాణి తదితరులు
నిర్మాణ సంస్థ : హైదరాబాద్ ఇన్నోవేటివ్స్ 
దర్శకత్వం : మన్మోహన్ 
నిర్మాత : భాస్కర్, సారిక శ్రీనివాస్ 
సంగీతం: సాయి కార్తీక్ 
రేటింగ్ : 2.5/5 
 
ప్లస్ అండ్ మైనెస్:
ఈ చిత్రానికి మూవీ కాన్సెప్ట్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మంచు లక్ష్మి, మాస్టర్ ప్రేమ్ బాబు, బేబీ డాలీలు ప్లస్ పాయింట్స్‌గా ఉన్నారు. కాగా స్టొరీ డెవలప్ మెంట్ బోరింగ్, స్క్రీన్ ప్లే సరిలేకపోవడం, వీక్ డైరెక్షన్‌లతో పాటు లాజిక్ లేని క్లైమక్స్ మైనస్ పాయింట్స్‌గా కనిపిస్తున్నాయి. 
 
విశ్లేషణ:  
దర్శకుడు మన్మోహన్ తల్లితండ్రులకి ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. పిల్లలని అశ్రద్ధ చేస్తే వారు ఎలా తయారు అవుతారు అనేది ఈ సినిమాలో చూపించాడు. సినిమా ప్రారంభం ఆసక్తిగా ప్రారంభం అవ్వడంతో ప్రేక్షకులు మెల్లగా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇలాంటి సందేశాత్మక చిత్రం తెరకెక్కించినందుకు దర్శకుడు మరియు నిర్మాతలని అభినందించాల్సిందే. ఫ్యామిలీ ప్రేక్షకులకి ఈ సినిమా పరవాలేదు అనిపించేలా ఉన్న కానీ, మాస్ ప్రేక్షకులకి అస్సలు నచ్చదని చెప్పాలి.