శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:06 IST)

లేడీ గబ్బర్‌సింగ్‌ 'బుల్లెట్‌ రాణి'

'గబ్బర్‌సింగ్‌'లో పవన్‌కళ్యాణ్‌ పోషించిన పవర్‌ఫుల్‌ అండ్‌ డేర్‌ డెవిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రకు మరింత మసాలా దట్టించి.. దాన్ని హీరోయిన్‌ ఓరియంటెడ్‌గా మలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందట బుల్లెట్ రాణి. 'బుల్లెట్‌ రాణి'లో ప్రియాంక కొఠారి (నిషా కొఠారి) పోషిస్తున్న పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌' అచ్చం గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మాదిరిగా ఉంటుందంటున్నారు చిత్ర దర్శకులు సురేష్‌ గోస్వామి. రాంగోపాల్‌ వర్మ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకొని.. తెలుగు, హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రియాంక కొఠారి అలియాస్‌ నిషా కొఠారి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న 'బుల్లెట్‌ రాణి' చిత్రాన్ని తెలుగు మరియు కన్నడ భాషల్లో ఏకకాలంలో.. 'ఫోకస్‌ ఆన్‌ పిక్చర్స్‌' పతాకంపై ఎం.ఎస్‌.యూసఫ్‌ నిర్మిస్తున్నారు. 
 
కన్నడలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన సురేష్‌ గోస్వామి.. 'యాక్షన్‌ ప్యాక్డ్‌ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌'గా రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'బుల్లెట్‌ రాణి'కి దర్శకత్వం వహిస్తున్నారు. బుల్లెట్‌ వేగంతో షూటింగ్‌ జరుపుకొంటున్న 'బుల్లెట్‌ రాణి' షూటింగ్‌ ఇప్పటికి 70 శాతం పూర్తయింది. చివరి షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. 
 
చిత్ర దర్శకుడు సురేష్‌ గోస్వామి మాట్లాడుతూ.. ''సెక్సీ సైరన్‌ ఇమేజ్‌ కలిగిన ప్రియాంక కొఠారి డేర్‌ డెవిల్‌, రఫ్‌ అండ్‌ టఫ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రమిది. సంఘ విద్రోహశక్తులపై.. ఓ లేడీ గబ్బర్‌సింగ్‌లా, ఓ సివంగిలా ఆమె విరుచుకు పడే తీరు అందర్నీ అమితంగా అలరిస్తుంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ ఫిలింగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 'గ్లామర్‌-యాక్షన్‌-కామెడి'ల కలగలుపుగా రూపొందిస్తున్నాం. 
 
తెలుగుతోపాటు, కన్నడలోనూ సైమల్టేనిస్‌గా రూపొందుతున్న ఈ 'మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌' ద్వారా తెలుగులో పరిచయమవుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకుగాను మా నిర్మాత ఎం.ఎస్‌.యూసఫ్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను' అన్నారు.  అమిత్‌, జస్పర్‌ (చెన్నయి ఎక్స్‌ప్రెస్‌ ఫేం), చేతన్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: వి.సురేష్‌కుమార్‌, కాస్ట్యూమ్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: నాగు, ప్రెస్‌ రిలేషన్స్‌: ధీరజ అప్పాజీ, యాక్షన్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, మ్యూజిక్‌: గున్వంత్‌, నిర్మాత: ఎం.ఎస్‌.యూసఫ్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేష్‌ గోస్వామి!!