శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (12:21 IST)

సమస్యల్లో బన్నీ మూవీ... ఎంఎస్ మృతితోనే..

ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్. నారాయణ ఆకస్మిక మృతి కారణంగా హీరో అల్లు అర్జున్ కొత్త చిత్రానికి సమస్యలు ఎదురయ్యాయి. సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. తమ చిత్రంలో ఎంఎస్ ఫుల్ కామెడీ రోల్‌ను పోషిస్తున్నట్టు తెలిపారు.
 
ఇందులో ఎంఎస్ పాత్ర చిత్రంతో కలిసిపోయి ఉంటుందన్నారు. ఎంఎస్ మృతి చెందడంతో ఆయన పాత్రలో మరొకరిని నటింపచేయడం కష్టతరంగా మారిందన్నారు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను అర్థ భాగం షూటింగ్ చేసినట్టు తెలిపారు. ఆయన పాత్రలో కొత్త వారిని నటింపచేయాలన్నా మొత్తం రీ షూట్ చేయాల్సి వస్తోందన్నారు.
 
తద్వారా బడ్జెట్ పెరగడమే కాకుండా ఆయన సన్నివేశాల్లో ఉన్న ఇతర పాత్ర దారుల కాల్ షీట్స్‌ సమస్య  కూడా ఎదురవుతున్నట్టు తెలిపారు. ఈ కారణాల వలన సినిమా విడుదలలో ఆలస్యం చోటు చేసుకుంటుందని త్రివిక్రమ్ వెల్లడించారు. కాగా అల్లు అర్జున్ కొత్త చిత్రానికి సన్‌ ఆఫ్ సత్యమూర్తి అనే టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే.