బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (15:35 IST)

''కత్తి'': 100 కోట్ల మార్కుకు చేరువవుతున్న విజయ్ మూవీ!

''కత్తి'' 100 కోట్ల మార్కుకు దగ్గరవుతోంది. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'కత్తి' చిత్రం వసూళ్లలో దూసుకుపోతోంది. ఎన్నో అవాంతరాల మధ్య ఈ నెల 22న కత్తి ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 
 
బుధవారం వరకు రూ.82 కోట్లు వసూలు చేసిన కత్తి.. ఈ వారం ముగిసేలోపు వందకోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. అదే కనుక నిజమైతే తమిళంలో ఈ ఏడాది భారీ విజయం సాధించిన సినిమా కూడా ఇదే అవుతుంది. తమిళ పరిశ్రమలో ఓ చిత్రం వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడమనేది చాలా అరుదు. 
 
ఈ నేపథ్యంలో నిస్సందేహంగా ఈ సంవత్సర తమిళ బ్లాక్ బాస్టర్ ఈ సినిమానే. తొలి వారంలోనే ఏకంగా రూ.82 కోట్లు కలెక్ట్ చేసింది. కచ్చితంగా రూ.వంద కోట్ల మార్కును చేరుకుంటుంది అని ట్రేడ్ అనలిస్ట్ చెబుతున్నారు.