శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (15:19 IST)

షణ్ముగ పాండియన్ సినిమా: ఫైట్ సీక్వెన్స్‌కి కోటి రూపాయలు!

ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ తన కుమారుడు షణ్ముగ పాండియన్ సినిమా కోసం భారీగా వెచ్చించాడు. తనయుడు షణ్ముగ పాండియన్ హీరోగా పరిచయమవుతున్న 'శతాబ్దం' చిత్రం కోట్లాది రూపాయల బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకుంటోంది. 
 
నేహా, శుభ్ర అయ్యప్ప హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం మలేసియాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కిచ్చా నేతృత్వంలో చిత్రీకరిస్తున్న ఈ ఫైట్ సీక్వెన్స్‌కి కోటి రూపాయలు ఖర్చుపెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
 
సముద్రంలో బోట్ చేజింగ్స్ నేపథ్యంలో... హీరో, విలన్లతో బాటుగా 200 మంది ఫైటర్లు ఇందులో పాల్గొంటున్నారు. వీటిని ఐదు కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ కాంత్ కూడా ఓ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ వేస్తున్నాడట.