బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (13:50 IST)

క్యాథరిన్ పంట పండింది.. మద్రాస్ కమర్షియల్ హిట్టయ్యింది!

టాలెంట్‌తో పాటు గ్లామర్ ఉన్నప్పటికీ మలయాళ కుట్టి క్యాథరీన్‌కు అవకాశాలు కలిసిరాలేదు. 2010లోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ, కమర్షియల్ సక్సెస్ కాలేకపోతోంది. తెలుగులో 'పైసా', 'ఇద్దరమ్మాయిలతో' లాంటి భారీ చిత్రాల్లో నటించినప్పటికీ, దక్షిణాదిన ఆమె ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. 
 
దీంతో ఆమె సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా గత కొంతకాలంగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు, నాలుగేళ్ల తర్వాత ఆమె సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. 
 
క్యాథరీన్ తాజాగా, తమిళంలో కార్తీ హీరోగా రూపొందిన 'మద్రాస్' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఇటీవలే తమిళనాట విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం హీరో కార్తీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు క్యాథరీన్‌కు తొలి కమర్షియల్ సక్సెస్‌ను అందించింది. 
 
'మద్రాస్' చిత్రంలో క్యాథరీన్ తన నటనతో తమిళ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో క్యాథరీన్ కు తమిళంలో భారీ ఆఫర్లు వస్తున్నట్టు కోలీవుడ్ సమాచారం.