గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (15:16 IST)

151వ నాయిక: దాసరి సినిమాలో కేథరిన్ థెరిస్సా!

151వ నాయికంటే ఇదేంటి అనుకుంటున్నారా? అదేం కాదులెండి.. ఇక్కడ 151 కథానాయిక అంటే అది దాసరి నారాయణరావు చిత్రాల కథానాయికల గురించి చెప్పిన సంఖ్య అన్నమాట.

తాజాగా దాసరి నారాయణరావు నిర్మించబోతున్న 151 చిత్రంలో కథానాయికగా కేథరిన్ థెరిస్సా నటిస్తోంది. ఎక్కడ మొదలుపెట్టామో మళ్లీ అక్కడే ప్రారంభిద్దాం అన్నట్లుగా దాసరి నారాయణరావు తన తొలి చిత్రం తాతా-మనవడు నుండి దర్శక ఎవరెస్టుగా ఎదిగిన సంగతి తెలిసిందే.
 
మళ్లీ ఆయన తన ఇన్నింగ్స్‌ను తాతా-మనవళ్ల కథా కథనంతో తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘మంజపై’ చిత్రానికి సంబంధించిన కథనాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కేథరిన్ పాత్ర ఎలా వుండబోతోందో? గ్లామర్ ఒలికిస్తుందో లేక నటననే చూపిస్తుందో? చూడాలి మరి!. కాగా కేథరిన్ సరసన మంచు విష్ణు నటించబోతున్నట్లు తెలిసింది.